Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిట్ కోసం సెంటిమెంట్‌ని న‌మ్ముకున్న బాల‌య్య‌

Webdunia
మంగళవారం, 7 మే 2019 (12:05 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన‌ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌డంతో బాగా అప్‌సెట్ అయ్యాడ‌ట‌. ఈసారి ఎలాగైనా స‌రే స‌క్స‌ెస్ సాధించాల‌ని ప‌క్కా ప్లాన్ రెడీ చేసాడ‌ట‌. మ్యాట‌ర్ ఏంటంటే... ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌తో బాల‌కృష్ణ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘జైసింహా’ సినిమాతో తొలిసారి జతకట్టిన వీరిద్దరూ మరోసారి హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నారు.
 
ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ పాత్రను పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్యకు విలన్‌గా జగపతిబాబు నటిస్తున్నట్లు పేర్కొంది. బ్లాక్‌ బ‌స్టర్ ‘లెజెండ్‌’ త‌ర్వాత బాల‌కృష్ణ, జ‌గ‌ప‌తిబాబు మరోసారి తలపడుతున్నారు. జ‌గ‌ప‌తిని విల‌న్‌గా ఎంచుకోవ‌డానికి కార‌ణం లెజెండ్ స‌క్స‌స్ అవ్వ‌డ‌మే అంటున్నారు.
 
 ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. సంక్రాంతికి బాల‌య్య‌ వ‌స్తే.. హిట్టే. ఈ భారీ చిత్రం మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వర‌లో ప్రక‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. హిట్ కోసం సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. మ‌రి.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయి బాల‌య్య‌కి విజ‌యాన్ని అందిస్తుందో లేదో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments