Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

డీవీ
సోమవారం, 13 జనవరి 2025 (18:35 IST)
Allu Arjun
పుష్ప 2 సినిమా ఇచ్చిన సక్సెస్ తో అల్లు అర్జున్ ఎంత ఆనందంగా వున్నాడో బయటకు వ్యక్తం చేయడానికి సంథ్య థియేటర్ కేస్ కారణం అయితే, రేవంత్ రెడ్డి విమర్శలు కూడా ఓ కారణ అనేది తెలిసిందే. మొత్తానికి సంక్రాంతికి అల్లు అర్జున్ కు కోర్టు కూడా ఫ్రీ నెస్ ఇచ్చేసింది. ఇక ప్రతిసారీ పోలీస్ స్టేషన్ కు రానవసరంలేదనీ, విదేశాలకు కూడా వెళ్ళవచ్చని పేర్కొంది. ఈ స్పూర్తితో తన తదుపరి సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిపి సినిమా చేస్తున్నట్లు ప్రధానంగా వార్త బయటకు వచ్చింది. 
 
పుష్ప 3 సినిమా వుంటుందని క్లయిమాక్స్ లో చెప్పాడు. అయితే ఇప్పటి పరిస్థితిలో ఆ సినిమా చేసే ఉద్దేశ్యంలేదని దర్శకుడు సుకుమార్ సూచాయిగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే  జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు చేసిన త్రివిక్రమ్ తో కలిసి స్వంత బేనర్ లో సినిమా చేయనున్నాడట. ఇందుకు కథను అల్లు అర్జున్ కు కథ కూడా వినిపించాడని తెలుస్తోంది.  త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. జనవరి నాలుగో వారం నుంచి పాత్ర గెటప్ పై మరోసారి కూర్చుని సెట్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కాకుండా డాకు మహరాజ్ తో సక్సెస్ సాధించిన థమన్ ఈ సినిమాకు బాణీలు అందించనున్నట్లు తెలుస్తోంది.
 
కాగావంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments