విజయ్ 'అదిరింది'కి అరవింద్ అడ్డుపడుతున్నారట... ఎందుకో తెలుసా?

తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ తమిళ చిత్రం ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మెర్సల్ చిత్రం వివాదంలో చిక్కుకోవడం, దానికి బాగా హైప్ రావడం, కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్టీపై

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (16:18 IST)
తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ తమిళ చిత్రం ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మెర్సల్ చిత్రం వివాదంలో చిక్కుకోవడం, దానికి బాగా హైప్ రావడం, కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్టీపై విమర్శనాస్త్రాలు బాగా పనిచేయడంతో చిత్రం ఎక్కడికో వెళ్లిపోయింది. కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. 
 
ఐతే తెలుగులో విడుదల కావాల్సిన అదిరింది చిత్రం మాత్రం విడుదల కాలేదు. దానికి పలు కారణాలు చెపుతూ వచ్చారు. భాజపా నాయకులు అడ్డుపడ్డారని ఒకరంటే సెన్సార్ కష్టాలు అని మరికొందరు చెప్పారు. కానీ తాజాగా దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో వార్త హల్చల్ చేస్తోంది. విజయ్ అదిరింది చిత్రం హక్కులు ప్రముఖ నిర్మాత శరత్ మరార్ వద్ద వున్నాయట. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దని మరో అగ్రనిర్మాత అల్లు అరవింద్ అడ్డుకుంటున్నారట. దానికి కారణం... ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‍తో రీమేక్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అదే నిజమైతే 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేనకు ఈ చిత్రం పెద్ద బూస్ట్ కావడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments