Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీకి షాక్ - నిహారిక దంపతుల వైవాహిక బంధానికి బీటలు?

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (10:08 IST)
మెగా ఫ్యామిలీకి మరో షాక్ తగిలనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మెగా డాటర్లలో ఒకరైన నిహారిక - ఆమె భర్త చైతన్య దంపతులు విడిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరి వివాహం గత 2020 సంవత్సరం, డిసెంబరు 9వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలకు చెందిన వారు పాల్గొన్నారు. చిత్రపరిశ్రమ నుంచి అతి కొద్ది మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. 
 
అయితే, ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య వ్యవహారశైలిపై ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వారిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మెగా ఫ్యామిలీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని ఫాలో అవుతున్న చైతన్య.. తన భార్య నిహారికను మాత్రం అన్ ఫాలో చేయడంతో ఈ వైవాహిక బంధానికి బీటలు వారాయన్న ప్రచారం సాగుతోంది. గతంలో కూడా ఇదే తరహా వార్తలు వచ్చినప్పటికీ అవి సద్దుమణిగిపోయాయి. ఇపుడు ఇలాంటి వార్తలే రావడంతో నిహారిక తండ్రి, నటుడు నాగబాబు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని మెగా అభిమానులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments