Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవీన్ హత్య కేసు.. నిహారిక విస్తుపోయే నిజాలు.. చెప్పినట్టే చేసేశాడు.

Advertiesment
murder
, గురువారం, 9 మార్చి 2023 (21:56 IST)
నవీన్ హత్య కేసు ఏ3గా వున్న ప్రియురాలు నిహారిక కన్ఫెషన్ స్టేట్‍మెంట్‌లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్‌తో ప్రేమలో వున్నానని.. చాలాసార్లు తమ ఇంట్లోనే ఇద్దం కలుసుకునే వాళ్లమని నిహారిక చెప్పింది. 
 
నవీన్‌తో తాను గొడవ పడితే హరిహర కృష్ణ తమకు సర్దిచెప్పేవాడని నిహారిక తెలిపింది. ఇలా నవీన్‌తో గొడవపడినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని అని.. అయితే నవీన్ దూరమయ్యాక  కృష్ణ తనను ప్రేమిస్తున్నానని తెలిపాడని వెల్లడించింది.
 
అంతేకాకుండా ఒకసారి నవీన్‌ను చంపేసి తనను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని చెప్పాడని నిహారిక తెలిపింది. చెప్పినట్లే చేశాడని.. ఏదో సరదాగా అంటున్నాడని అనుకుంటే.. నిజం చేశాడని.. నవీన్‌ను చంపేశాడని నిహారిక తెలిపింది. 
 
నవీన్‌ను కృష్ణ దారుణంగా చంపాడని నిహారిక చెప్పింది. నవీన్ స్నేహితులకు కానీ పోలీసులకు కానీ ఎవరికి చెప్పకుండా దాచి పెట్టానని.. అది తప్పేనని వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెఫ్రీ ద జిరాఫీని మీరు చూశారా?