Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న అల్లు అర‌వింద్..!

Webdunia
సోమవారం, 20 మే 2019 (18:48 IST)
అక్కినేని అఖిల్ న‌టించిన మూడు చిత్రాలు అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను.. నిరాశ‌ప‌రిచాయి. దీంతో అఖిల్ నాలుగ‌వ సినిమాపై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా స‌రే.. స‌క్స‌ెస్ సాధించాల‌ని అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ర‌విరాజా పినిశెట్టి కుమారుడు, ఆది పినిశెట్టి సోద‌రుడు ప్ర‌భాస్ పినిశెట్టి చెప్పిన క‌థ‌ను ఓకే చేసాడు. 
 
ఈ క‌థ‌తో అఖిల్ నాలుగవ సినిమా ఉంటుంది అనుకుంటే.. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేసారు. ఎందుకంటే... ఈ సినిమా అఖిల్‌కి చాలా ఇంపార్టెంట్. అందుచేత నాగ చైత‌న్య‌కి బ్లాక్‌బ‌స్ట‌ర్ 100% ల‌వ్ చిత్రాన్ని అందించిన అల్లు అర‌వింద్ అనుబంధ సంస్థ‌లో అఖిల్ నాలుగ‌వ‌ చిత్రం చేస్తున్నాడు. బ‌న్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. గోపీ సుంద‌ర్ సంగీత‌మందించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి క‌థానాయిక ఎంపిక ఇంకా పూర్త‌వ‌లేదు.
 
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని ఎప్పుడో ప్రారంభించాలి కానీ... స్ర్కిప్ట్‌లో పూర్తిగా సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో ప్రారంభోత్స‌వం వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. మే 24న లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి కానీ... అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో అక్కినేని అభిమానులు ఇంకెప్పుడు సినిమాని స్టార్ట్ చేస్తారు అంటూ తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి... త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభోత్స‌వంపై క్లారిటీ వ‌స్తుందేమో..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments