Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల్లోకి వెళ్తే నీకు పెళ్లికాదన్నాడు.. ప్రేమ, పెళ్లి గురించి?: పవన్ హీరోయిన్

ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. అయితే సినిమాల్లోకి వెళ్తానని.. హీరోయిన్ అవుతానని చెప్పిన వెంటనే.. ఇక పొసగదన్నాడు. అంతేకాదు.. సినిమాల్లోకి వెళ్తే పెళ్లి కాదన్నాడని.. పవన్ హీరోయిన్ నికిషా పటేల

Webdunia
శనివారం, 26 మే 2018 (15:08 IST)
ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. అయితే సినిమాల్లోకి వెళ్తానని.. హీరోయిన్ అవుతానని చెప్పిన వెంటనే.. ఇక పొసగదన్నాడు. అంతేకాదు.. సినిమాల్లోకి వెళ్తే పెళ్లి కాదన్నాడని.. పవన్ హీరోయిన్ నికిషా పటేల్ తెలిపింది. ప్రేమ, పెళ్లి గురించి ముందు ఆలోచించేదాన్నని.. అయితే ఇప్పుడు ఆ ఆలోచన లేదని.. తనకెప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటానని నికిషా పటేల్ వెల్లడించింది. 
 
ఇంకా తన ప్రేమ గురించి నికిషా పటేల్ మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రాకముందు.. తాను, ఒక వ్యక్తి ప్రేమించుకున్నామని చెప్పింది. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని చెప్పింది. అయితే, తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో అప్పుడే లవ్‌కు బ్రేక్ పడిందని తెలిపింది. అతనికి తాను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని.. అందుకే గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడని నికిషా పటేల్ వెల్లడించింది. 
 
అంతేగాకుండా సినిమాల్లోకి వెళ్తే మన పెళ్లి జరగదని కచ్చితంగా చెప్పేశాడని.. అప్పుడు తనకు పెళ్లి కన్నా సినిమాల్లోకి రావడమే ప్రధాన లక్ష్యంగా కనిపించిందని, అతనితో ఆ విషయం చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా ఇద్దరం విడిపోయామంది. అన్నీ తెలిసే అతన్ని వదులుకున్నాను. సినిమాల్లో వచ్చినా సక్సెస్ కాలేకపోయానని పవన్ హీరోయిన్ అయిన నికిషా పటేల్ చెప్పుకొచ్చింది. కాగా కొమరం పులి సినిమాలో పవన్ సరసన నికిషా పటేల్ నటించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments