Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న గుండెంగి గ్రామంలో వైఎస్. షర్మిళ ఉద్యోగ దీక్ష

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (19:55 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ప్రతి మంగళవారం ఒక రోజు నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు గ్రామాల్లో ఆమె దీక్ష చేశారు. ఈ దీక్షలో భాగంగా, ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి, ఓదార్చుతున్నారు. 
 
ఇదిలావుంటే, మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మహబూబాబాద్ జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మహబూబాబాద్ జిల్లాలోని గుండెంగి గ్రామంలో ఉద్యోగ దీక్ష చేయనున్నారు. అనంతరం మంగళవారం రాత్రి వరంగల్ పట్టణంలోనే షర్మిల బస చేస్తారు. ఉద్యోగ దీక్షతో పాటు పోడు భూముల పోరుకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టనున్నారు.
 
మరోవైపు ఎల్లుండి (బుధవారం) ములుగు జిల్లా లింగాల గ్రామంలో షర్మిల పోడు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పర్యటన అనంతరం వైఎస్ షర్మిల.. తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్ష చేపడుతున్న వైఎస్ షర్మిల గత మంగళ వారం హుజూరాబాద్ నియోజక వర్గంలో ఉద్యోగ దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments