Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్.షర్మిల అరెస్టు - స్టేషన్‌కు తరలింపు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (14:40 IST)
తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే అంశంపై హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. 
 
ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 
 
అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బి.జనార్థన్ రెడ్డికి ఆమె వినతి పత్రం సమర్పించారు. నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన షర్మిల పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments