Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడవు - ఉపాసన సెన్సేష‌న‌ల్ కామెంట్‌

Advertiesment
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడవు -  ఉపాసన సెన్సేష‌న‌ల్ కామెంట్‌
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:49 IST)
Upasana, Ramcharan
ప్రేమికుల రోజు సందర్భంగా జీవితకాలం ఆనందంగా ఉండడానికి గల రహస్యాలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో షేర్‌ చేశారు. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామ్‌చరణ్‌తో వివాహమై 10 సంవత్సరాలైందని తెలిపారు. తమ మధ్య అన్యోన్యతకు,  జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో బంధం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆమె టిప్స్‌ చెప్పారు. ‘‘నేను చరణ్‌ పెళ్లి చేసుకుని పదేళ్లు అయ్యింది. వాలంటైన్స్‌ డే నాకు ఎప్పుడూ ప్రత్యేకమే! ప్రియమైన వారితో మీ బంధం మరింత బలంగా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి. వివాహ బంధంలో ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్‌ ఉంది. 
 
కాబట్టి మనం ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్థపెట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అందరూ అంటారు. అది నిజం కాదు.. భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తేనే వివాహానికి పునాది పడుతుంది. వీటితోపాటు ఎదుటివ్యక్తిపై ప్రేమ, గౌరవం చూపించాలి. ప్రియమైన వారితో టైమ్‌ స్పెండ్‌ చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఖాళీ సమయం దొరికితే డిన్నర్‌ డేట్‌, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం.. వల్ల జీవితం మరింత అందంగా మారుతుంది. ఇవి ఫాలో కాకపోతే ఇప్పటికేౖనా దయచేసి మీ వారి కోసం సమయాన్ని కేటాయించడం అలవాటు చేసుకోండి’’ అని ఉపాసన ఆ వీడియోలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీమ్లా నాయ‌క్ తో కొత్త సినిమాకు చ‌ర్చ‌లు జ‌రిపిన హ‌రీష్ శంక‌ర్