Bhimla Naik, Harish Shankar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ కూడా చేయనున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ల్‌ప్లే సమకూరుస్తున్నారు. మలయాళ చిత్రానికి రీమేక్‌గా చేస్తున్న ఈ సినిమాలో రానా అపోజిట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో రానా సినిమాహీరోగా నటిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఇగోస్ వల్ల ఏర్పడిన వివాదాలే కథ.
కాగా, దీనికి సంబంధించిన ఓ చిన్న పేచ్‌వర్క్‌ను హైదరాబాద్ శివార్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ కలిశాడు. పవన్, షరీశ్ శంకర్ కలయిక మరో సినిమాకు సంబంధించిన చర్చగా సాగింది. వీరి కాంబినేషన్‌లో భవదీయుడు భగత్‌సింగ్ అనే రాబోతుంది. దీనికి సంబంధించిన విషయాలను వీరిద్దరూ మాట్లాడుకున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ విషయం ఇప్పటికే ఫ్యాన్స్‌లో బాగా వైరల్ అయింది. సోసల్‌మీడియాలో వీరి కలయిక గురించి మరో హిట్ కోసం నాంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.