Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిల కొత్త పార్టీ పేరు... వైఎస్సార్ తెలంగాణ పార్టీ

Webdunia
గురువారం, 8 జులై 2021 (18:30 IST)
వైఎస్ఆర్ కుమార్తె వైఎస్. షర్మిల కొత్త పార్టీని పెట్టారు. తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు. ఈ మేరకు గురువారం జరిగిన ఆవిర్భావ సభలో ప్రకటించారు. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆమె ప్రసంగించారు. 
 
జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ నినాదాలతో షర్మిల తన ప్రసంగం ప్రారంభించారు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకం వైఎస్సార్ అని తెలిపారు. మా నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్సార్ అని కొనియాడారు.
 
గురువారం ఆయన జయంతి అని, ఇది మనందరికీ పండుగ రోజని తెలిపారు. ఆయన చూపిన బాటలో నడవడానికి, ఈ రోజు ఆయన పుట్టినరోజున మన పార్టీ 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ'ని స్థాపిస్తున్నామని షర్మిల ప్రకటన చేశారు. 
 
మరోసారి సంక్షేమ రాజ్యం తీసుకువచ్చేందుకు వైఎస్సార్ 72వ జయంతి రోజున 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ' ఏర్పాటు ప్రకటన చేస్తున్నామని వెల్లడించారు. 
 
సభలో షర్మిల మాట్లాడుతూ.. తమ పార్టీ అజెండాలో మూడు ముఖ్యమైన అంశాలను ప్రకటించారు. సంక్షేమం.. స్వయం సంవృద్ధి.. సమానత్వం సాధన దిశగా తమ పార్టీ సాగుతుందన్నారు.
 
నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని, శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ అని ఆమె పేర్కొన్నారు. ఆయన జయంతి రోజున ఆయన అడుగుల్లో నడిచేందుకు వైఎస్ఆర్‌టీపీని స్థాపించామన్నారు. 
 
ఆయన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి వచ్చామన్నారు. ఇవాళ్టికీ వైఎస్ ఓ రోల్ మోడల్ అన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్.. పావలా వడ్డీ ఇచ్చారని, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శనికుడు వైఎస్ అన్నారు. 
 
డాక్టరా.. ఇంజినీరా.. ఎంబీయేనా అన్నది తేడా లేకుండా ఉచిత చదువులకు అవకాశం ఇచ్చిన నేత ఆయన అన్నారు. పేద విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించారని, ఆరోగ్యశ్రీ ఇచ్చిన నేత అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments