ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ దగ్గుబాటి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమవుతున్నారు. ఆనందీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్నఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
తాజాగా ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. దర్శకుడు తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్, గేయ రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి ట్యూన్స్ రెడీ చేస్తున్నారు.
ఆర్.పి.పట్నాయక్ ను సంగీత దర్శకుడిగా తేజ పరిచయం చేశారు. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల తరువాత వాళ్లిద్దరు మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. మనసుకు హత్తుకునే సాహిత్యానికి ప్రసిద్ది చెందిన స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. ఈ ముగ్గురి కలయికలో అభిరామ్ ఫస్ట్ మూవీ తప్పకుండా మ్యూజికల్ బొనాంజగా ఉండబోతుంది.
ఆనంది ఆర్ట్స్ పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.