స్టార్టర్ బాక్స్ ఓపెన్ చేస్తే.. త్రాచుపాము బుసకొట్టింది.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (18:03 IST)
స్టార్టర్ బాక్స్ ఓపెన్ చేస్తే.. త్రాచుపాము బుసకొట్టింది. దీంతో మోటర్ పంపు స్టార్టర్ రిపేరింగ్‌కు వెళ్లిన ఎలక్ట్రీషియన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. రిపేర్ చేయడానికి స్టార్టర్‌ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో పెద్ద తాచుపాము పడుకుని ఉంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ ఎలక్ట్రీషియన్.. చాకచక్యంగా వ్యవహారించి పామును బయటకు తీశాడు. ఈ సంఘటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామం పరిధిలోని ఖమ్మగూడెం ప్రైవేట్ స్కూల్‌లో మోటర్ రిపేరింగ్ అయ్యింది. బాగు చేయడానికి వెళ్లిన ఎలక్ట్రీషియన్ శేఖర్(25) మోటర్ స్టార్టర్‌ను ఓపెన్ చేశాడు. వెంటనే బుస్సుమంటూ తాచుపాము పడగ విప్పిందట. 
 
కొంచెమైతే కాటు వేసేదని తెలిపాడు ఎలక్ట్రీషియన్ శేఖర్. కరెంట్ ఉంటే షాట్‌ సర్క్యూట్‌ అయి అగ్ని ప్రమాదం జరిగి ఉండేదని తెలిపాడు. ఎలాంటి ప్రమాదం లేకుండా పామును స్థానికుల సాయంతో బయటకు తీసి చంపేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments