Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా అవకాశాల కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేసి హత్య...

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (13:56 IST)
సినిమాల్లో నటించాలన్నది ఆమె కోరిక. ఎలాగైనా సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో నిలబడదామకుని అనుకుంది. ఎం.ఎ. చదువుకున్న ఆ యువతి సినిమా మోజులో పడి ఇంట్లో వాళ్ళను వద్దనుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. 
 
అమీర్ పేటకు చెందిన పూజిత స్థానికంగా ఉన్న హాస్టల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజు ఫిలింనగర్‌కు వెళ్ళేది. ఇలా నెలరోజుల పాటు ఫిలింనగర్ చుట్టూ తిరిగింది. అయితే ఈమె అవసరాన్ని గుర్తించిన ఇద్దరు వర్కర్లు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నారు. అందంగా ఉన్న పూజితను అనుభవించాలనుకున్నారు.
 
ఫిలింనగర్లో తిరిగితే ఉపయోగం లేదని ఉప్పల్ సమీపంలో అనుబంధ కార్యాలయం ఉందని అక్కడకు రమ్మన్నారు. రాజేష్, బబ్లు మాటలు విన్న ఆ యువతి ఒంటరిగా కార్యాలయానికి వెళ్లింది. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న వీరిద్దరు ఆ ప్రాంతంలోనే ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తరువాత విషయం బయట ఎక్కడ చెప్పేస్తుందోనని భయపడి హత్య చేశారు.
 
మృతదేహాన్ని కారులో తీసుకెళ్ళి ఇండస్ట్రియల్ ఏరియాలో పడేశారు. తెల్లవారిన తర్వాత స్థానికులు యువతి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ లోతుగా చేసిన పోలీసులు నిందితులు రాజేష్, బబ్లులుగా గుర్తించి అరెస్టు చేశారు. సినిమా అవకాశాలు ఇస్తామని ఎవరైనా నమ్మించి కొత్త ప్రాంతాలకు రమ్మంటే ఎవరు నమ్మి వెళ్ళవద్దంటున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments