Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసవం.. భార్య మృతి.. ఆ బాధను తట్టుకోలేక భర్త రైలు కింద పడి ఆత్మహత్య

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (17:18 IST)
పసిబిడ్డకు ఊపిరి పోసి పురిట్లోనే భార్య మరణించింది. ఆ బాధను తట్టుకోలేక భర్త కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా మక్తల్‌కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్.. తన ఇంటి పక్కనే ఉండే భీమేశ్వరిని ప్రేమించాడు. 
 
వీరిద్దరి ప్రేమను యువతి తల్లీదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఏడాది క్రితం విహహం చేసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చారు. భార్యాభర్తలిద్దరూ ఎంతో అప్యాయంగా ఉంటున్నారు. నవీన్ కుమార్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం భార్య భీమేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేర్చాడు. 
 
ప్రసవం అనంతరం భీమేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లితో పాటు శిశువును మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి బాగోకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి ఆసుపత్రిలో ప్రాణం విడిచింది. 
 
ఓ పక్క చిన్నారి ప్రాణపాయ స్థితిలో ఉండటం, మరోవైపు ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృత్యుఒడికి చేరడంతో మనస్తాపానికి గురైన నవీన్ కుమార్ తాను చనిపోవాలని నిర్ణయించుకుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
మృతుడి జేబులో సెల్ ఫోన్ ఆదారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వైపు భార్య చనిపోయిందన్న బాధలో తాను చనిపోవడంతో.. రెండు రోజుల క్రితం జన్మించిన చిన్నారి అనాథగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments