Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో సైకో కిల్లర్: భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నదనీ...

Advertiesment
murder
, మంగళవారం, 16 ఆగస్టు 2022 (21:29 IST)
ఇటీవల విశాఖ పెందుర్తిలో చోటుచేసుకున్న వరుస హత్యలు కలకలం సృష్టించాయి. ప్రజలు హడలిపోయారు. హతులంతా ఎక్కువగా స్త్రీలు కావడంతో పాటు ఇనుప రాడ్డుతో హత్యలు చేసాడు నిందితుడు. ఈ నరరూప రాక్షసుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
ఈ నేపధ్యంలో హంతకుడి గురించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడికి 2018లో ఆ షాకింగ్ ఘటన ఎదురైంది. అతడి భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని కళ్లారా చూసాడు. దాన్ని తట్టుకోలేకపోయాడు. భార్యకు విడాకులు ఇచ్చాడు. పిల్లల్ని చూసేందుకు వారు ససేమిరా అనడంతో ఒంటరిగా మిగిలాడు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడు. అక్కడ మోసపోయాడు. ఏం చేయాలో దిక్కుతోచక పొట్టకూటి కోసం ఆటో డ్రైవరుగా మారాడు. విశాఖలో ఆటో నడుపుతూ జీవనం సాగించాడు. ఐతే తన భార్య మోసం చేసినందుకు మహిళలపై కక్ష పెంచుకున్నాడు.

 
ఒంటరిగా వున్న మహిళలపై దాడి చేసి హత్య చేసేవాడు. ఈ క్రమంలో ఆగస్టు 6న అర్థరాత్రివేళ చినముషిడివాడ సప్తగిరినగర్లో ఓ భవన నిర్మాణం వద్ద కాపలాదారులుగా వున్న దంపతులను దారుణంగా హత్య చేసాడు. హత్య చేసాక మరణించినవారిలో మహిళ వున్నదా లేదా అని తెలుసుకునేందుకు వారి ప్రైవేట్ పార్ట్స్ చూసేవాడు. మహిళే అని తెలుసుకున్న తర్వాత శవాన్ని కాలితో తన్ని అక్కడి నుంచి పరారయ్యాడు.

 
సరిగ్గా వారం తర్వాత... ఆగస్టు 14న సుజాతనగర్ లోని నాగమల్లి లేఅవుట్లో నిర్మాణంలో వున్న అపార్టుమెంట్ ఎదురుగా వున్న రేకుల షెడ్డులో నిద్రిస్తున్న లక్ష్మి అనే మహిళపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేసాడు. నిందితుడు ఫోను ఉపయోగించకుండా తిరగుతుండటంతో అతడిని పట్టుకోవడంలో క్లిష్టతరమైందని పేర్కొన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిల్కిస్ బానోను గ్యాంగ్ రేప్ చేసి, కుటుంబ సభ్యులను చంపిన 11మందిని గుజరాత్ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసింది?