అక్రమ సంబంధం వద్దన్నాడనీ... భర్తను ఎలా చంపిందో చూడండి

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (09:49 IST)
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో సొంత భర్తనే ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది.
 
బిహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ జా ఉపాధి కోసం నగరానికి వచ్చి ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తా రాజ్‌నగర్‌లో భార్యా, పిల్లలతో కలిసి బతుకుతున్నాడు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌లో ఓ జ్యూస్ పాయింట్ ప్రారంభించాడు.

ఇందులో పనిచేసేందుకు వారికి దూరపు బంధువైన లాల్‌బాబును నియమించాడు. అయితే లక్ష్మణ్‌ జా భార్య కుష్బుదేవికి, బంధువైన లాల్‌బాబుకు సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌ హెచ్చరించినా వీరు ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో తమ బంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించి ఈనెల 14న రాత్రి లక్ష్మణ్‌జా నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలిసి మెడకు చున్నీ బిగించి చంపేసింది.

మరుసటిరోజు ఉదయం భర్త సోదరుడు బిహారి జాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించింది.

సోదరుడి మృతిపై అనుమానంతో బిహారి జా పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయాలు బయటికి వచ్చాయి. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments