Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకుతుందేమోనని మూడు నెలలుగా విమానాశ్రయంలోనే నివాసం... ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (09:40 IST)
కరోనా సోకుతుందేమోనన్న భయంతో మూడు నెలలుగా  విమానాశ్రయంలోనే గడిపాడో వ్యక్తి. అతని వ్యవహారం పై అనుమానం వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
భారతీయ సంతతికి చెందిన 36 ఏళ్ల ఆదిత్య సింగ్‌ కరోనా సోకుతుందేమోనన్న భయంతో విమానాశ్రయంలోనే ఉండిపోయినట్లు వివరించాడు. కాగా, ఆదిత్య సింగ్‌ కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజిల్స్‌ శివారులో నివసిస్తున్నాడు.

హాస్పటాలిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌ 19న  లాస్‌ ఏంజిల్స్‌ నుండి విమానంలో చికాగోలోని ఓహెర్‌ విమానాశ్రయానికి వచ్చాడని, అప్పటి నుండి అక్కడే భద్రతా జోన్‌లో ఉంటున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణికులు ఇచ్చిన ఆహారాన్ని తింటున్నాడని చెప్పారు. కరోనా భయంతో విమానం ఎక్కేందుకు భయపడి ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయినట్లు తెలిపారు. అనుమానం వచ్చిన సిబ్బంది గుర్తింపుకార్డు చూపించాల్సిందిగా కోరారు.

ఆపరేషన్స్‌ మేనేజర్స్‌కి చెందిన ఒక బ్యాడ్జిని చూపించారని, అయితే ఆ గుర్తింపు కార్డులోని వ్యక్తి అక్టోబర్‌ నుండి కనిపించడం లేదని ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది చెప్పారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ఆదిత్యకు ఎటువంటి క్రిమినల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేదని తేల్చారు. అయితే ఆ వ్యక్తి కరోనా భయంతో తన నివాసానికి వెళ్లకుండా విమానాశ్రయంలోనే ఉన్నట్లు తేల్చారు. ఈ కేసు విన్న కౌంటీ జడ్జి సుశానా ఆర్టిజ్‌ ఆశ్చర్యపోయారు.

పరిస్థితులు అసాధారణంగా ఉన్నప్పటికీ.. ఒక వ్యక్తి ఫేక్‌ గుర్తింపు కార్డుతో ఎయిర్‌పోర్టులోని భద్రతా వలయంలో మూడు నెలల పాటు నివసించడం సరికాదని పేర్కొంటూ.. బెయిల్‌ పొందేందుకు వెయ్యి అమెరికన్‌ డాలర్లు (రూ.73,200) చెల్లించాల్సిందిగా ఆదేశించారు.

అలాగే మరోసారి చికాగో విమానాశ్రయంలోకి ప్రవేశించకూడదని ఆదేశిస్తూ.. జనవరి 27న తిరిగి కోర్టులో హాజరుపరచాల్సిందిగా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments