Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లో కరోనా కేసులు.. టీకా తీసుకున్నా కోవిడ్ వదలట్లేదు..

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (10:21 IST)
కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా ముప్పు తప్పలేదు. ఈ కేసులు ఎక్కువగా వరంగల్‌లో ఇటీవల వెలుగుచూస్తున్నాయి. వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు రెండు విడతలు టీకా తీసుకున్నా మళ్లీ కరోనా బారిన పడ్డారు. కీర్తినగర్‌ యూపీ హెచ్‌సీల్‌లో నాలుగు రోజుల కిందట 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 
 
అందులో రెండోవిడత టీకా తీసుకున్న ఏడుగురికి కోవిడ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. మరో ట్వీస్ట్ ఏమిటంటే టీకా తీసుకున్నవారికి కోవిడ్‌ పాజిటివ్‌ వస్తే అధికారులు పాజిటివ్‌ రిపోర్టు చేతికి ఇవ్వడం లేదు. చరవాణికి సంక్షిప్త సందేశాన్నీ పంపడం లేదు. 
 
ఆరా తీస్తే వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి పాజిటివ్‌ వస్తే పోర్టల్‌లో తీసుకోవడం లేదని సిబ్బంది అంటున్నట్లు బాధితులు తెలిపారు. పాజిటివ్‌ రిపోర్టు ఇస్తేనే అధికారులు సెలవు మంజూరు చేస్తామంటున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. 
 
దీనిపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి మాట్లాడుతూ.. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. టీకా వేయించుకుంటే వంద శాతం వైరస్‌ సోకదని చెప్పలేమన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments