Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టకాలం : హైదరాబాద్‌లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!

Webdunia
సోమవారం, 20 జులై 2020 (10:51 IST)
కరోనా కష్టకాలంలోనూ నకిలీ వైద్యులు రోగులను వదిలిపెట్టడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఇద్దరు నకిలీ వైద్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించరు. ఈ నకిలీ వైద్యులు మున్నాభాయ్ ఎంబీబీఎస్ తరహాలో అవతారమెత్తి ఏకంగా ఆస్పత్రినే ప్రారంభించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెహిదీపట్నంకు చెందిన మహ్మద్‌ సోహెబ్‌ సుభానీ, మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ స్నేహితులు. సోహెబ్‌ ఇంటర్‌ పూర్తిచేసి, ఓ టెక్నో స్కూల్‌ను నిర్వహించాడు. ముజీబ్‌ పదో తరగతి చదివాడు. హుమాయిన్‌నగర్‌లోని ఎంఎం దవాఖానాలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆస్పత్రి వ్యాపారంలో మంచి లాభాలుంటాయని సోహెబ్‌తో ముజీబ్‌ చెప్పాడు. 
 
దీంతో సోహెబ్‌ దవాఖాన పెట్టాలని నిర్ణయించాడు. డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ముజీబ్‌ అనే పేరుతో ఓ నకిలీ ఆధార్‌కార్డును సృష్టించి దాని ఆధారంగా సోహెబ్‌.. సమీర్‌ ఆస్పత్రిని ప్రారంభించి ముజీబ్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాడు. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌తో డీఎంహెచ్‌వోలో 2017 నుంచి 2022 వరకు అనుమతి పొంది మోహిదీపట్నంలో సమీర్‌ దవాఖానను నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రికి ముజీబ్ ఎండీగా కొనసాగుతున్నారు.
 
ఈ క్రమంలో కొవిడ్‌-19 యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న కొందరు మెడికల్‌ ఏజెన్సీలు, మెడికల్‌ షాపుల నిర్వాహకుల ముఠాను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు బృందం శనివారం అరెస్టు చేసింది. వీరిని విచారించగా నకిలీ వైద్యులు ఆస్పత్రి వ్యవహారం వెలుగుచూసింది. పోలీసులు.. ముజీబ్‌, సోహెబ్‌ను అరెస్ట్‌చేసి, రిజిస్ట్రేషన్‌ పత్రం, డాక్టర్‌ ముజీబ్‌ పేరుతో తయారుచేసిన నకిలీ ఆధార్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments