దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై తర్వాత అత్యధిక కేసులు పూణే నగరంలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. పూణేలో కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నాయి.
కరోనా వైరస్ సోకి హాస్పిటల్‌కి వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ఇంట్లో వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నజాబితాలో పూణే, సూరత్, కోల్‌కతా. ఢిల్లీ, చెన్నై. ముంబై, అహ్మదాబాద్ ఉన్నాయి.
ఇక కరోనా కారణంగా ఆస్పత్రిలో వున్న వారు.. వారి తరపు బంధువులు ఏ క్షణంలో ఎలాంటి వార్తా వినాల్సి వస్తుందోనని జడుసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి కరోనా చికిత్స తీసుకుని ఇంటికి వచ్చింది. డిశ్చార్జ్ అయి ఇంటి రావడంతో ఆ యువతి తల్లిదండ్రులు నానా హంగామా చేశారు.
ఆ యువతి వీధి చివర ఉండగానే ఇంటివద్ద బ్యాండ్ మేళాలు మోగించారు. ఆమె సోదరి తీన్మార్ స్టెప్పులు వేస్తూ సోదరికి స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.