Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన రాహుల్.. చెప్పేవన్నీ అబద్ధాలే!

Advertiesment
Institutionalised Lies
, ఆదివారం, 19 జులై 2020 (16:22 IST)
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. అధికారంలో వున్న బీజేపీ సర్కారు అసత్యాలను వ్యవస్థీకృతం చేసిందని మండిపడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి, ఆర్థిక వ్యవస్థ, భారత్-చైనా ప్రతిష్టంభనలపై మోదీ సర్కారు అసత్యాలు చెప్తోందని  ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ ట్వీట్‌తోపాటు రాహుల్ గాంధీ ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని జత చేశారు.
 
కరోనా వైరస్ సంబంధిత మరణాలు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలపై తప్పుడు సమాచారం ఇస్తోందని రాహుల్ గాందీ ఆరోపించారు. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ప్రతిష్టంభనపై మీడియాను కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని తెలిపారు. 
 
కోవిడ్-19 టెస్టులను పరిమితం చేశారని, మరణాలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కొత్త లెక్కింపు విధానంతో జీడీపీపై అవాస్తవాలున్నాయన్నారు. ఈ భ్రమలు త్వరలోనే తొలగుతాయని, భారత దేశం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్‌కు బీజేపీ కీలకపదవి