Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిక్‌ టాక్, హెలో సహా 59 మొబైల్ యాప్స్‌ బంద్.. డ్రాగన్ కంట్రీ హెచ్చరిక

టిక్‌ టాక్, హెలో సహా 59 మొబైల్ యాప్స్‌ బంద్.. డ్రాగన్ కంట్రీ హెచ్చరిక
, మంగళవారం, 30 జూన్ 2020 (22:28 IST)
డ్రాగన్ కంట్రీకి చుక్కలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి, సరిహద్దు వివాదంతో చైనాపై భారత్‌తో పాటు పలు దేశాలు గుర్రుగా వున్నాయి. తాజాగా టిక్‌ టాక్ సహా 59 మొబైల్ యాప్స్‌ను నిషేధం విధించడం తమను ఆశ్చర్యపరిచిందని చైనా విదేశాంగ శాఖ చెబుతోంది. 
 
మరోవైపు చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించడంపై ఆ సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. వినియోగదారుల గోప్యత, భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. చైనా సహా ఏ ప్రభుత్వానికీ డేటా లీక్ చేయలేదని టిక్‌టాక్ ఇండియా ప్రకటించింది.
 
భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామని టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని తెలిపారు. టిక్‌టాక్‌పై నిషేధం తాత్కాలికంగానే ఉంటుందన్న ధీమా వ్కక్తం చేశారు.
 
మరోవైపు టిక్‌టాక్‌ను గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించాయి. ఇకపై ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యపడదు. కేంద్ర ప్రభుత్వం ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లకు లేఖ రాస్తే... ఇప్పటికే మొబైల్స్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న టిక్‌టాక్ యాప్‌ కూడా ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యే అవకాశముంది. కాగా ఈ నెల 15వ తేదీన గల్వాన్ లోయ ఘటన చోటు చేసుకోవడంతో అప్పటినుంచి చైనా యాప్ లను నిషేధించాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపించాయి. తాజాగా కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది.
 
అయితే పౌరుల డేటా చోరీ, దేశ భద్రతకు విఘాతం అనే కారణాలతో చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఐటీ చట్టంలోని 69ఏ సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. 
 
గడిచిన రెండు నెలలుగా సరిహద్దు వెంబడి హింసాత్మక దురాగతాలకు పాల్పడుతోన్న చైనాకు ధీటుగా బదులిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన నేపథ్యంలో యాప్స్‌పై నిషేధాన్ని 'డిజిటల్ స్ట్రైక్స్'గా భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపించే ఈ నిర్ణయంపై చైనీస్ మీడియా ఊహించినట్లుగానే స్పందించింది. చైనా కూడా భారత ప్రాడక్ట్స్ బ్యాన్ చేస్తే.. కోలుకోలేని దెబ్బ తప్పదని డ్రాగన్.. ప్రతీకార హెచ్చరిక చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లెలిపై అత్యాచారం.. జైలులోనే నిందితుడి చంపేసిన సోదరుడు.. సినీ ఫక్కీలో..?