ప్రజలకు వినోదాన్ని పంచుతాం, అనుమతివ్వండి: మంత్రి తలసానికి విజ్ఞప్తి

Webdunia
శనివారం, 2 మే 2020 (19:29 IST)
లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారని, వారికి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు గాను షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాలని పలు ఛానళ్ళ ప్రతినిధులు కోరారు. 
 
మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కె.సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్‌లు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 
 
టివి షూటింగ్‌లకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్‌లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. 
 
కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయటకు వెళ్ళలేకపోతున్నారని, వారికి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు షూటింగ్‌లను నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని వారు కోరారు. 
 
స్పందించిన మంత్రి ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments