Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ - 10 నుంచి పది సప్లమెంటరీ పరీక్షలు

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (13:22 IST)
తెలంగాణా రాష్ట్రంలో, ఇంటర్, పది తరగతుల పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సిప్లమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా, ఆగస్టు ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. 
 
ఈ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. అదేవ విధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సర సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మరోవైపు, ఆగస్టు ఒకటో తేదీ నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్  సప్లమెటరీ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు జరుగుతాయని చెప్పరారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు నిర్వహించనున్నట్టు చెప్పారు. పది పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చే నెల 18వ తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో ఫీజు చెల్లించి ఈ పరీక్షలు రాయొచ్చని వివరించారు. 
 
అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల టైం టేబుల్‌ను పరిశీలిస్తే, 
ఆగ‌స్టు ఒకటో తేదీన ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఆగ‌స్టు రెండో తేదీన సెకండ్ లాంగ్వేజ్
ఆగ‌స్టు మూడో తేదీన థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
ఆగ‌స్టు నాలుగో తేదీన మ్యాథ‌మేటిక్స్
ఆగ‌స్టు ఐదో తేదీన జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ)
ఆగ‌స్టు ఆరో తేదీన సోష‌ల్ స్ట‌డీస్
ఆగ‌స్టు ఎనిమిదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
ఆగ‌స్టు పదో తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments