Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో గిరిజన బాలికపై అత్యాచారం.. షాక్‌తో గుండెపోటు.. బాలిక మృతి

Webdunia
సోమవారం, 31 మే 2021 (12:46 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతూనే వున్నాయి. బలాత్కారాలు, గృహ హింసలు ఓ వైపైతే.. మాయమాటలతో లొంగదీసుకుని ప్రేమ పేరుతో మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా మహబూబాబాద్‌‌లో ఓ యువకుడు గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలతో మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు. అయితే అత్యాచారం సమయంలో ఆమె గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
అత్యాచారం సమయంలో ఊహించని షాక్‌కు గురైన ఆమె గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో చోటుచేసుకుంది. వివరాలాల్లోకి వెళితే.. తండాకు చెందిన మోడు లక్‌పతి, వసంత దంపతుల కుమార్తె ఉష (17) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
 
తండ్రి లక్‌పతికి మహబూబాబాద్‌ జాతీయ రహదారిపై పెట్రోల్‌ బంక్‌ వద్ద కిరాణ దుకాణం ఉంది. ఇటీవల ఆయన కాలు విరగడంతో షాపులో ఉన్న సరుకులు తీసుకురావాలని శనివారం కూతురు ఉషను పంపించాడు. అదే సమయంలో ధర్మారం గ్రామానికి చెందిన ధరంసోత్‌ రాజేశ్‌ దుకాణం వద్దకు వచ్చాడు.
 
ఉషకు మాయమాటలు చెప్పి సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన స్నేహితుడు, సీతారాం తండాకు చెందిన శ్రీనుకు ఫోన్‌ చేసి నీళ్లు తీసుకురావాలని సూచించాడు. అతను తన స్నేహితుడైన శంకర్‌తో కలసి వచ్చే సరికి ఉష స్పృహ తప్పి ఉంది. దీంతో ముగ్గురు కలసి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఉష అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  
 
ఈ ఘటనపై అమాయకురాలైన తమ బిడ్డకు మాయమాటలు చెప్పి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఉష తల్లిదండ్రులు లక్‌పతి, వసంత బోరున విలపించారు. ఈ ఘటనలో రాజేశ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. కాగా, ఉషపై రాజేశ్‌ ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడా..?, మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడిపై పోక్సోతో పాటు 376, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ధోనీ!

Dr. Mohanbabu: మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతం విడుదల

Balakrishna: బాలకృష్ణ నటించిన టైమ్ ట్రావెల్ చిత్రం ఆదిత్య 369 రీ రిలీజ్

Sushanth: రెండు డిఫరెంట్ లుక్‌లలో సుశాంత్ అనుమోలు కొత్త సినిమా పోస్టర్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments