రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కీచులాట నెలకొనివుంది. ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సోమవారం భేటీకానున్నాయి. బోర్డుల చైర్మన్లతో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి సమావేశమవుతారు.
ఈ సందర్భంగా బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించనున్నారు. జూలై 15న రెండు బోర్డుల పరిధికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై రెండు బోర్డులు ఇప్పటికే సంప్రదింపులు జరిపాయి. అవసరమైన సమాచారం, వివరాలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను బోర్డులు కోరాయి. దీంతో కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. గెజిట్‌లోని తమ అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.