Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దళితబంధుపై 27న సీఎం కేసీఆర్ సమీక్ష!

Advertiesment
Dalit Bandhu Scheme
, శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (15:26 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించి అమలు చేస్తున్న పథకాల్లో దళితబంధు ఒకటి. ఈ పథకం అమలుకు ఇప్పటికీ శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు.
 
దళితబంధు అమలుకానున్న నాలుగు మండలాల్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 
 
హుజురాబాద్‌తోపాటు మరో నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
 
ఇందులోభాగంగా, నాలుగు దిక్కుల్లో ఎంపిక చేసిన మండలాల వివరాలను పరిశీలిస్తే, ఖ‌మ్మం జిల్లా, మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం, చింత‌కాని మండ‌లం, సూర్యాపేట జిల్లా, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం, తిరుమ‌ల‌గిరి మండ‌లం, నాగర్‌క‌ర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం, చార‌గొండ మండ‌లం, కామారెడ్డి జిల్లా, జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం, నిజాం సాగ‌ర్ మండ‌లంలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధి వినాయ‌కుడిని ద‌ర్శించుకున్న ఎంపీ భ‌ర‌త్ రామ్