Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపతుల మధ్య చిచ్చుపెట్టిన టిక్‌టాక్ : భర్త ఆత్మహత్య

Webdunia
సోమవారం, 12 జులై 2021 (11:22 IST)
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌లలో ఒకటైన టిక్ టాక్ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. పొద్దస్తమానం భార్య టిక్ టాక్ వీడియోలు చేస్తుండటంతో భర్తకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో భార్యతో గొడవపడ్డాడు. అప్పటికీ ఆమె మారే సూచనలు కనిపించలేదు. దీంతో మనస్తాపం చెందిన భర్త... బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ప్రియాంక, ప్రవీణ్ అనే దంపతులు ఉన్నారు. వీరు బాలానగర్ సమీపంలో నివసిస్తుంటారు. టిక్ టాక్‌లో వీడియోలు పోస్టు చేయడం ప్రియాంకకు ఓ వ్యసనంగా మారిపోయింది. 
 
అయితే ఆమె భర్త ప్రవీణ్ అందుకు అభ్యంతరం చెప్పేవాడు. భర్త మాటను లెక్కలోకి తీసుకోని ప్రియాంక టిక్ టాక్‌లో పోస్టులు పెట్టడాన్ని కొనసాగించింది. తాను టిక్ టాక్ స్టార్ అవ్వాలని కలలుగన్న ఆమె ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంపై దృష్టి సారించింది.
 
దాంతో భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రమయ్యాయి. తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. భార్య తన మాట వినడంలేదని భావించిన ప్రవీణ్ బలవన్మరణం చెందాడు. దీనిపై ప్రవీణ్ తల్లిదండ్రులు బాలానగర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ప్రియాంక కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments