సింగరేణిలో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటన: ముగ్గురు మృతి

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (11:51 IST)
సింగరేణిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్‌లోని సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం ఈరోజు వెలికితీసింది.
 
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్‌ తేజావత్‌ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు రాగా… బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ ఎస్‌ జయరాజు, కాంట్రాక్ట్‌ కార్మికుడు తోట శ్రీకాంత్‌ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.
 
సోమవారం సింగరేణిలోని 86వ లెవల్‌ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలిపోయింది. దీంతో ఇద్దరు ఉద్యోగులు, ఏడుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సింగరేణి రెస్క్యూ బృందం రాత్రి వరకు ముగ్గురిని ప్రాణాలతో కాపాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవికి కలిసిరాని బాలీవుడ్.. రామాయణంపై దృష్టి?

Kabeersing: బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ది రెడ్ బ్యాగ్ చిత్రీకరణ పూర్తి

Trigun : త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ల చిత్రం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్

Prabhas: కల్కి 2 అప్ డేట్ - ప్రభాస్ ఎంట్రీ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ

Ramcharan: పెద్ది విడుదల కోసం రామ్ చరణ్ అభిమానులు 30రోజుల వినూత్న ప్రచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments