ఇది మా తొలి విజయం: షర్మిల

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:48 IST)
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామానికి చెందిన యువకుడు నీలకంఠం సాయి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణలో ఉద్యోగ నోటిషికేషన్ల విడుదల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిల ఆ విషయం తెలిసి పరామర్శించేందుకు నిన్న వెళ్లారు.
 
అయితే, యువకుడి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను కలవ వద్దని టీఆర్ఎస్ నేతలు బాధిత యువకుడి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపించారు. ఇది తమ తొలి విజయమని షర్మిల అభివర్ణించారు.
 
తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చింతలపాడు మండలంలోని దొండపాడు వెళ్లి ఇటీవల కరోనాతో మృతి చెందిన వైసీపీ నేత, ఏపీ బేవరేజెస్ కోఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments