తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:45 IST)
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈనెల 24 వరకు పొడిగించారు.

ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోసం 2 లక్షల 25 వేల 125 మంది, అగ్రికల్చర్ బీఎస్సీ కోసం 75 వేల 519 మంది దరఖాస్తు చేసుకోగా తాజా పొడిగింపుతో మిగిలిపోయిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. 

ఇప్పటికే జులై 5 నుంచి 9 వరకు జరగాల్సిన మూడు ఎంట్రన్స్ టెస్టులను ఉన్నత విద్యామండలి రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు ఎంట్రన్స్ సెట్స్ లో మూడు సెట్స్ తేదీల్లో మార్పు ఉంటుందని, మిగిలిన నాలుగు సెట్స్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. 

ఈ పరిస్థితుల్లో ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తూ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటన విడుదల చేశారు. ఈ గడువు పొడిగింపు వల్ల వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా దరఖాస్తు చేసుకనే అవకాశం కలిగిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda: తిరుమలలో సాంప్రదాయబద్ధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల వివాహం

Anupama: మారేడుమిల్లి అడవుల్లో భోగి చిత్రం నుంచి అనుపమ పరమేశ్వరన్ లుక్

శివాజీ డ్రెస్సింగ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన గాయత్రీ గుప్తా

Pooja Hegde : బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమాయణం

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ లాయల్ కష్టమర్ల కోసం మైఖేల్ చిత్ర ప్రత్యేక ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

ఆరోగ్యకరమైన పనితీరుకు ఎర్గోనామిక్స్ కీలకం: ప్రముఖ ఎర్గోనామిక్స్ నిపుణుడు మను నెల్లుట్లచే నాట్స్ వెబినార్

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

విశాఖపట్నంలో ఫరెవర్ న్యూ మొదటి స్టోర్ ప్రారంభం

హైదరాబాద్‌లో బ్రాండ్ బొటిక్‌ను ప్రారంభించిన లాంజీన్స్ ఫ్రెండ్ ఆఫ్ ది బ్రాండ్ సారా అలీ ఖాన్

తర్వాతి కథనం
Show comments