Webdunia - Bharat's app for daily news and videos

Install App

దున్నపోతుకు... బాదం నూనెతో బాడీ మసాజ్ - వారానికి ఒకసారి ప్రీమియం స్కాచ్

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (19:38 IST)
ఆ దున్నపోతుకు వారానికి ఒకసారి బాదం నూనెతో బాడీ మసాజ్ చేస్తారు. అలాగే, వారంలో ఒక రోజు ప్రీమియం స్కాచ్ తాగిస్తారు. ప్రతి రోజూ మూడు కేజీల డ్రై ఫ్రూట్స్, యాపిల్స్‌ను తినిపిస్తారు. ఇంతకీ ఆ దున్నపోతు ప్రత్యేక ఏంటనే కదా మీ సందేహం.. 
 
అయితే, ఈ కథనం చదవండి... ప్రతి యేటా హైదరాబాద్ నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల కోసం ఆరేండ్ల వ‌య‌సున్న ఈ బాహుబ‌లి దున్న‌ను హ‌ర్యానా నుంచి తీసుకొచ్చారు. దీన్ని స‌ద‌ర్ ఉత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శించనున్నారు. 
 
ఈ దున్న‌పోతును ప్ర‌తి రోజు 3 కిలోమీట‌ర్ల మేర వాకింగ్‌కు తీసుకెళ్తారు. ప్ర‌తి ఆదివారం స్విమ్మింగ్‌కు కూడా తీసుకెళ్తారు. స్విమ్ చేసిన త‌ర్వాత త‌నంత‌ట తానే ఇంటికి తిరిగి వ‌స్తుంది. ఈ దున్న నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తి రోజు రూ.7 వేల‌ు ఖర్చు చేస్తారు. దీని పరిరక్షణ కోసం ముగ్గురు సిబ్బందిని విధుల కోసం నియమించారు. 
 
అలాగే, రోజుకు 25 లీట‌ర్ల పాల‌ను తాగేస్తోంది. ప్ర‌తి శ‌నివారం బాదం నూనెతో బాడీ మ‌సాజ్ చేస్తారు. వారంలో ఒక రోజు ప్రీమియర్ స్కాచ్ తాపిస్తారు. స్కాచ్ ఇవ్వ‌డం వ‌ల్ల ఆ దున్న‌కు మంచి ఆరోగ్యాన్ని, జీర్ణవ్యవస్థ స‌రిగా ఉండేందుకు సహాయపడుతుందని నిర్వాహకులు చెప్పారు.
 
ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న ఈ దున్న‌పోతు హైద‌రాబాద్ స‌ద‌ర్ ఉత్స‌వాల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతుంది. ఇంతకీ ఈ బాహుబలి దున్న 7.5 ఫీట్ల పొడ‌వు, 18 ఫీట్ల వెడ‌ల్పు ఉంది. 2000 కేజీల బ‌రువు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments