వెంటిలేటర్ పైన ప్రియురాలికి తాళికట్టి ధైర్యం చెప్పిన ప్రియుడు, కానీ?

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (17:38 IST)
కరోనా ఎన్నో బంధాలను బలితీసుకుంటోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన 27యేళ్ళ యువతి.. జీవితంపై ఎన్నో ఆశలు  పెట్టుకుంది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తోంది. ఈ యేడాది చివరలో తను ప్రేమించిన యువకుడిని పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంది.
 
వీరి ప్రేమకు ఇరువర్గాల పెద్దలు అంగీకరించారు కూడా. ఇక పెళ్ళిపీటలు ఎక్కడమే ఆలస్యమనుకున్నారు అంతా. సాఫీగా సాగిపోతుందనుకున్న ఆమె జీవితం విషాదంగా మారింది. ఆమె కరోనా బారిన పడింది.
 
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మూడేళ్ళుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడు రోజూ ఆమెకు దైర్యం చెప్పేవాడు. ఆమెను బతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించారు. 
 
దీంతో ఆమె ధైర్యం కోల్పోయింది. ఆమెలో ధైర్యం పెంచేందుకు చికిత్స పొందుతున్న ఆమె బెడ్ పైనే తాళికట్టాడు యువకుడు. క్షేమంగా ఇంటికి వస్తుందనుకున్నాడు. సంతోషంగా జీవిద్దామనుకున్న యువతి, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె సోదరుడు, ప్రేమించిన యువకుడు ఇద్దరూ కలిసి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. యువతి తల్లిదండ్రులకు కూడా కరోనా రావడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. కూతురు చనిపోయిందనే వార్త తల్లిదండ్రులకు ఇప్పటికీ తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments