Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోట్ల ఆస్తి ఉన్నా చిల్లిగవ్వ ఇవ్వడంలేదని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

Advertiesment
కోట్ల ఆస్తి ఉన్నా చిల్లిగవ్వ ఇవ్వడంలేదని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
, గురువారం, 6 మే 2021 (16:23 IST)
భర్త బాగా ఆస్తిపరుడు.. కానీ ఖర్చులకు డబ్బులివ్వడు. ఏం కావాలన్నా కొనిచ్చేవాడు. భర్త పిసినారితనం ఏమాత్రం భార్యకు ఇష్టముండేది కాదు. పెళ్ళయి సంవత్సరాలవుతున్నా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఒక యువకుడికి కనెక్టయ్యింది వివాహిత. అంతటితో ఆగలేదు అతనితో కలిసి భర్తను అతి దారుణంగా చంపి కటాకటాల పాలైంది.
 
చెన్నైకి చెందిన భాస్కర్ మాజీ వార్డు మెంబర్. నాలుగు సరుకు రవాణా లారీల ఓనర్. అలాగే రెండు పరిశ్రమలు కూడా ఉన్నాయి. బాగా ఆస్తిపరుడు 15 సంవత్సరాల క్రితం కీల్పాకంకు చెందిన ఉషతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉష తమ్ముడు సెల్వం రెండు సంవత్సరాల క్రితమే బావ దగ్గరకు వచ్చి ఆయన దగ్గరే పనిచేస్తూ ఉండేవాడు.
 
ముందు నుంచి భాస్కర్‌కి పిసినారితనం ఎక్కువ. ఎప్పుడూ అనవసర ఖర్చు వద్దు అంటూ భార్యకు చెబుతూ ఉండేవాడు. డబ్బులున్నా ఏమీ కొనుక్కోలేకపోవడంతో ఉష తీవ్ర ఆవేదనతో ఉండేది. అక్కడే పనిచేసే లారీ క్లీనర్ మురుగన్ అనే వ్యక్తితో ఉషకు పరిచయం ఏర్పడింది.
 
ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. మురుగన్ ఉషకు ఏం కావాలన్నా తీసిస్తూ ఉండేవాడు. అతను అవివాహితుడు. మురుగన్‌కు బాగా దగ్గరైన ఉష తన భర్తను చంపేస్తే కావాల్సినంత ఆస్తి వస్తుందని ప్లాన్ చేసింది. తమ్ముడు సెల్వం సహాయం కూడా వీరిద్దరు తీసుకున్నారు. 
 
ముగ్గురు కలిసి రెండురోజుల క్రితం నిద్రిస్తున్న భాస్కర్‌ను అతి కిరాతకంగా నరికి చంపేసి ఊరి బయట వుండే చెరువులో పడేశారు. మరోవైపు బెడ్ పైన రక్తపు మరకలు మొత్తాన్ని తుడిచేసి కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. అయితే భాస్కర్ మృతదేహాన్ని నిన్న కనుగొన్న పోలీసులు. మృతుడి తరపు బంధువులు అతడి భార్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీనితో అసలు విషయం బయటపడింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిగివచ్చిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు