Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప ఏడుస్తుందని చెప్పినా పట్టించుకోలేదు.. వనస్థలిపురంలో దారుణం

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (19:05 IST)
హైదరాబాద్ శివారులో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ శివారులోని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందడం వివాదాస్పదమైంది. దీంతో ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. నాదర్ గుల్‌కి చెందిన స్వప్న అనే మహిళ నాలుగురోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. పాప ఏడుస్తుందని సిబ్బందికి చెప్పగా చూసెళ్లిపోయారే కానీ పట్టించుకోలేదు. 
 
కానీ కొద్దిసేపటి తరవాత పాప ఏడుపు ఆపేసింది. కళ్లు కూడా మూసేసింది. ఆ పాపను పరీక్షించిన వైద్యులు మరణించినట్లు ధ్రువీకరించారు. ఎంతసేపు ఏడ్చినా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ముందే చెబితే మరో ఆస్పత్రికి తీసుకెళ్లే వాళ్లం కదా అని బంధువులు నిలదీశారు. కనీసం డాక్టర్‌లు సమాచారం కూడా ఇవ్వలేదని బంధువులు మండిపడ్డారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే పండంటి పాప మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments