Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించిన ఏపీ ప్ర‌భుత్వం

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించిన ఏపీ ప్ర‌భుత్వం
విజ‌య‌వాడ‌ , బుధవారం, 1 డిశెంబరు 2021 (14:00 IST)
అస‌మాన సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇతోధికంగా సాయ‌ప‌డింది. సిరివెన్నెల చికిత్స కోసం అయిన‌ ఆసుపత్రి ఖర్చులను  కిమ్స్ ఆసుప‌త్రి  యాజమాన్యానికి ఏపి ప్రభుత్వం చెల్లించింది.


సిరివెన్నెల ఊపిరితిత్తుల వ్యాధితో ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న చేరిన నాలుగైదు రోజుల‌కు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయ‌న చికిత్స‌కు అయిన ఖ‌ర్చు మొత్తం ప్ర‌భుత్వ‌మే చెల్లించింది. అంతే కాదు, అంత వ‌ర‌కు అంత వ‌ర‌కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ స‌భ్యులు,  ఆసుపత్రిలో కట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని కూడా సిరివెన్నెల కుటుంబానికి తిరిగి  ఇవ్వాలని ఆసుపత్రికి  ఏపి ప్రభుత్వం తెలిపింది. 
 
 
సినీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నివాళి అర్పించింది. ప్ర‌భుత్వం త‌రఫున ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని హైదారాబాద్ ఫిలిం ఛాంబ‌ర్ కి వెళ్ళి సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నివాళులు అర్పించారు. ఆయ‌న భార్య‌ను, బంధువుల‌ను ఓదార్చారు. వారి కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని ధైర్యం చెప్పారు. అక్క‌డే మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర‌ఫున నివాళులు తెలిపారు. ఇలా మాట‌ల‌తోనే గ‌డ‌ప‌కుండా, ఆయ‌న కుటుంబానికి మేలు క‌లిగేలా, ఆసుప‌త్రి ఖ‌ర్చులు చెల్లించి అండ‌గా నిలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నబిడ్డ కోసం చిరుత పులిని తరిమికొట్టింది.. పెద్ద కర్ర పట్టుకుని..