తెలంగాణ ఆర్టీసి బస్సులో తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యం

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (17:14 IST)
ఓ తాత్కాలిక బస్ డ్రైవర్ మరో తాత్కాలిక మహిళా కండక్టర్ పైన బస్సులోనే అత్యాచార యత్నం చేశాడు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసు స్టేష పరిధిలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోకుండా పథకం ప్రకారం ఒంటరిగా ఉన్న కండక్టర్ పైన బస్సులోనే అత్యాచార యత్నం చేశాడు డ్రైవర్ శ్రీనివాస్. 
 
చెన్నూరు నుండి నిన్న రాత్రి 7.30 గంటలకు మంచిర్యాల వస్తుండగా అటవీ ప్రాంతంలో బస్సును ఆపి డ్రైవర్ శ్రీనివాస్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అయితే ఆ కండక్టర్ పెద్దగా అరవడం, దగ్గర్లో ఉన్న వాళ్ళు బస్సు వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో బస్సును డ్రైవర్ ముందుకు తీసుకెళ్ళాడు. విషయం తెలిసిన జైపూర్ పోలీసులు జైపూర్‌లో బస్సును ఆపి కండక్టర్‌ను రక్షించారు. 
 
శ్రీనివాస్ పైన అత్యాచార యత్నం అనే కేసు కాకుండా అసభ్యంగా ప్రవర్తిచినట్టు కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళా కండక్టర్‌ను ఆమె స్వంతూరుకు పంపించారు. ఈ విషయం బైటికి పొక్కకుండా రవాణా శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికి విషయం దాగలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth :రజనీకాంత్ జైలర్ 2 నుంచి తాజా అప్ డేట్ ప్రకటించిన సన్ పిక్చర్స్

Akhil: అఖిల్ అక్కినేని రగ్గడ్ లెనిన్ ట్రైలర్ 10 మిలియన్ల దాటి ఉత్సాహానిచ్చింది

రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణ పూర్తి

Sureshbabu: నాగబంధం సెట్ అభిషేక్ చూడమని చెప్పారు, అద్భుతమైన విజువల్స్ వున్నాయి : డి. సురేష్ బాబు

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

తర్వాతి కథనం
Show comments