Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో విషాదం... క్రికెట్ ఆడుతుండగా టెక్కీకి గుండెపోటు - మృతి

Webdunia
ఆదివారం, 7 మే 2023 (12:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గుండెపోటు వచ్చిది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచాడు. రంగారెడ్డి జిల్లా కేసీఆర్ స్టేడియంలో విషాదకర ఘటన జరిగింది. మ్యాచ్ మధ్యలోనే వెన్ను నొప్పి రావడంతో బయటకువచ్చి కారులో పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచాడు. మృతుడిని ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంకు చెందిన మణికంఠగా గుర్తించారు.
 
హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే మణికంఠ హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌ బీలో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈయన తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై మృతుని సోదరుడు వెంకటేశ్ స్పందిస్తూ, శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ స్టేడియంలో మ్యాచ్ ఉందని వెళ్లాడని, మధ్యాహ్నం సోదరుడి స్నేహితుడు యశ్వంత్ తనకు ఫోన్ చేసి మణికంఠ చనిపోయాడని చెప్పాడన్నాడు. 
 
క్రికెట్ ఆడుతుండగా, వెన్నునొప్పి వచ్చిందని చెప్పి కారులో వెళ్లి పడుకున్నాడని, మ్యాచ్ అయిపోయిన తర్వాత పిలిచినా పలకకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పాడు. అయితే, అప్పటికే మణికంఠ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మణికంఠ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments