Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ఫ్ లైన్లు

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (09:57 IST)
తెలంగాణ చాలామంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి సహాయం కోసం వేచి ఉండటంతో, సహాయం కోరుతున్న వారి కోసం తెలంగాణ ఢిల్లీ, హైదరాబాద్‌లలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది.
 
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో, హైదరాబాద్‌లోని రాష్ట్ర సెక్రటేరియట్‌లో హెల్ప్ లైన్లు రష్యా సైనిక దాడికి గురవుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, నిపుణులకు సహాయపడతాయి.
 
తెలంగాణ భవన్ లో హెల్ప్ లైన్ నంబర్లు +91 7042566955, +91 9949351270 మరియు +91 9654663661. ఇమెయిల్ ఐడి rctelangana@gmail.com.
 
హైదరాబాద్ లోని తెలంగాణ సెక్రటేరియట్ లో హెల్ప్ లైన్ నెంబర్లు 040-23220603, +91 9440854433. ఇమెయిల్ ఐడి so_nri@telangana.gov.in.
 
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు మద్దతు అందించడానికి తెలంగాణ కు చెందిన విద్యార్థులు/ప్రొఫెషనల్‌తో సంప్రదింపులు జరపాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలంగాణ భవన్‌లోని రెసిడెంట్ కమిషనర్‌ను అభ్యర్థించారు.
 
చిక్కుకుపోయిన విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని తెలంగాణ పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కె.టి.రామారావు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌ను కోరారు.
 
భారతీయ విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని రామారావు జైశంకర్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్విట్టర్‌లో ఇలా అన్నారు: "ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అనేక సందేశాలు అందుకుంటున్నాయి. 
 
భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా పనిచేయగలదని మరియు భారతీయులందరికీ సాధ్యమైనంత త్వరగా భరోసా ఇవ్వగలదని ఆశిస్తున్నాను."
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి చెందిన విద్యార్థులు తమ తరలింపును నిర్ధారించాలని భారత ప్రభుత్వానికి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments