Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:54 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. మంత్రి శ్రీనివాస్ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ముఖ్యంగా, ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కొట్టివేసింది. 
 
గత 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌‍లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని, తొలుత సమర్పించిన అఫిడవిట్‌ను వెనక్కి తీసుకుని మళ్లీ కొత్త అఫిడవిట్‌ను సమర్పించారంటూ మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందువల్ల ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత తీర్పును మంగళవారం వెలువరించింది. పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన తరుణంలో మంత్రి శ్రీనివాస్ గౌడకు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments