Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూలు బాలికపై తండ్రి స్నేహితుల అఘాయిత్యం

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. స్కూలుకు వెళుతున్న ఓ బాలికపై ఆ బాలిక తండ్రి స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా, ఎప్పటిలాగే సోమవారం స్కూలుకు బయలుదేరింది. అయితే, బాలికను ఆమె తండ్రి స్నేహితులు ముగ్గురు అడ్డుకుని కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఆమెను బైక్ ఎక్కించుకుని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక కామాంధులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా, చంపేస్తామని బెదిరించారు. 
 
పైగా, సామూహిక అత్యాచారానికి వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని హెచ్చరించారు. అయితే, ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments