Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు ఉన్నాడా? కేటీఆర్ ప్రశ్న

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (16:53 IST)
బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రం నిరంకుశ పాలనపై అందరం కలిసి పోరాటం చేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

దళిత బంధు విజయవంతమైతే దేశం యావత్తు తెలంగాణ వైపే చూస్తుంది అని దేశంలో ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు ఉన్నాడా? అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్.

తెలంగాణ సర్కారు దళితుల అభ్యున్నతి కోసం ద‌ళిత బంధు పేరిట ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి రూ.10ల‌క్ష‌లు ఇచ్చే ప‌థ‌కానికి రూప‌క‌ల్పన చేశామ‌ని..తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో దళితులకు పెద్దపీట వేశామని తెలిపారు.
 
ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే రెండు కులాలు. ఒకటి ఉన్నోవారు. అమెరికాలో కూడా రెండు కులాలున్నాయి. ఒకటి నల్లోడు, రెండు తెల్లోడు హైదరాబాద్‌లో ఉండే మాకు కులాల పట్టింపులు ఉండదని కేటీఆర్ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. 
 
అయితే దేశంలో కులం, మతం పిచ్చి పెరుగుతోందని కేటీఆర్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. తెలంగాణను మా ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కేంద్రం ప్రభుత్వం ఓర్వలేక అభివృద్ధికి అడ్డుపడుతోంది అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్న‌ది ఎవ‌రో ఆలోచించాలని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments