వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యవహరం సంచలనంగా మారింది. మొన్నటివరకూ హోం మంత్రిగా పదవిలో ఉండి, తాజా మాజీ అయిన ఆమెను ఇప్పుడు పార్టీలో ఎవ్వరూ పట్టించుకోవటం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్దీకరణలో సీనియర్‌ల జాబితాతో పాటుగా సామాజిక వర్గాల సమీకరణాల్లో సుచరితకు మంత్రి పదవి దక్కలేదు. మొదటినుంచీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్న సుచరిత, వైఎస్ఆర్ ఉండగానే ఆయనకు అత్యంత ఆప్తురాలుగా ముద్రవేసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఆమెకు ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకంగా హోం మంత్రి పదవి ఇచ్చి జగన్ గౌరవించారు. అంతే కాదు గతంలో పత్తిపాడు ఉప ఎన్నికలో కూడ సుచరిత వైసీపీ నుండి గెలుపొంది విజయం సాధించారు.
వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉండటంతో ఆమెకు వైసీపీ పార్టీలో కూడ తగిన ప్రాధాన్యత లభించిది. సామాజిక వర్గం పరంగా కూడా సుచరితకు పార్టి పదవులు వరించాయి. కానీ కేబినెట్ కూర్పుపై ఆమె అలక చెందారని.. ఇందుకోసం సుచరిత సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అవుతారని తెలుస్తోంది.