Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలిచాక పార్టీ మారనంటూ బాండ్ రాసిస్తేనే బీఫామ్!

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (12:20 IST)
ఇటీవలికాలంలో ఒక పార్టీ టిక్కెట్‌పై గెలిచిన తర్వాత విజయం సాధించాక మరోపార్టీలోకి జంప్ కావడం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన పార్టీ ఇచ్చే తాయిలాలకు విపక్ష పార్టీలకు చెందిన విజేతలు పార్టీ మారిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి విజయం సాధించిన తర్వాత పార్టీ మారబోనంటూ బాండ్ పత్రం రాసిస్తేనే బిఫామ్ ఇస్తామనే షరతను విధిస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పలువు కాంగ్రెస్ పార్టీ విజేతలు అధికార తెరాసలో చేరారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గెలిచిన తర్వాత తాము పార్టీ వీడబోమంటూ బాంబ్ పేపర్ రాసిచ్చినవారికే బీఫామ్‌ ఇస్తోంది. 
 
ఈ వివరాల్లోకి వెళ్తే కామారెడ్డిలో గెలిచిన తర్వాత పార్టీ మారబోమంటూ బాండ్ పేపర్ రాసిచ్చే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీని కోరారు స్థానిక కార్యకర్తలు. మన పార్టీ బిఫామ్ మీద పోటీ చేసి గెలవగానే తెరాస పార్టీలో చేరుతున్నారంటూ షబ్బీర్ అలీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అయితే, కామారెడ్డి జిల్లాలో జరుగుతోన్న తొలి విడత ఎన్నికల కోసం అభ్యర్థులకు బీఫారమ్‌లు ఇచ్చే సమయంలో ఇది చర్చగా మారింది. దీంతో పార్టీ మారబోమని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న 9 మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు షబ్బీర్ అలీ సమక్షంలో బాండ్ పేపర్‌పై లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి బీఫామ్‌లు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments