Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 19 మంది డీఎస్పీలకు స్థానచలనం

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (10:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలకు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి బదిలీ ఆదేశాలను జారీచేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పోస్టింగ్‌ కోసం వెయింగ్‌లో ఉన్న డీఎస్పీ జి.హనుమంత రావును కూకట్‌పల్లి ట్రాఫిక్‌ ఏసీపీగా బదిలీ చేశారు. 
 
ఇప్పటివరకు అక్కడ ట్రాఫిక్‌ ఏసీపీగా ఉన్న ఏ.చంద్రశేఖర్‌ను కూకట్‌పల్లి ఏసీపీగా నియమించారు. కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న బి.సురేందర్‌ రావును సైబరాబాద్‌ ఏసీపీగా నియమించారు. 
 
ఇబ్రహింపట్నం ఏసీపీగా ఉన్న వై.యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ ఆఫీస్‌లో, జగిత్యాల ఎస్డీపీఓగా ఉన్న పీ వెంకటరణ, చౌటుప్పల్‌ ఏసీపీగా ఉన్న పి.సత్తయ్య, గద్వాల డీఎస్పీ ఏ.యాదగిరిని చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.
 
బదిలీ అయిన డీఎస్పీల వివరాలను పరిశీలిస్తే, ఏ అనిల్‌ కుమార్‌ - కాగజ్‌నగర్‌ ఎస్డీపీఓ, కే బాల కృష్ణా రెడ్డి- ఇబ్రహింపట్నం ఏసీపీ, మాదాత రమేష్‌- గజ్వేల్‌ ఏసీపీ, ఆర్‌ శ్రీనివాస్‌- ఆసిఫాబాద్‌ ఎస్డీపీఓ, రత్నాపురం ప్రకాశ్‌- జగిత్యాల ఎస్డీపీఓ, ఆర్‌ సతీశ్‌ కుమార్‌- గోషామహల్‌ ఏసీపీ, , ఎన్‌ ఉదయ్‌ రెడ్డి- చౌటుప్పల్‌ ఏసీపీ, సాయి రెడ్డి వెంకట్‌ రెడ్డి- భువనగిరి ఏసీపీ, వాసాల సత్తయ్య- హుస్నాబాద్‌ ఏసీపీ, ఎన్సీ రంగస్వామి- గద్వాల్‌ డీఎస్పీ, కే సైదులు- మెదక్‌ ఎస్డీపీఓలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments