Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడే పుట్టిన కవల ఆడపిల్లలకు విషం తాపించిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (13:13 IST)
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా... కొంతమంది మనషులు మాత్రం మారడం లేదు. విద్యావంతులతో పాటు.. నిరక్ష్యరాస్యులు కూడా ఒకేలా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి అపుడ పుట్టిన ఇద్దరు కవల ఆడపిల్లలకు విషం తాపించాడు. దీంతో ఆ ఇద్దరు శిశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 
 
ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం దేశాయిపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేశాయిపల్లికి చెందిన కృష్ణ‌వేణి అనే మహిళ ఇటీవల ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వారికి ఇప్పటికే ఓ కూతురు ఉం‌ది. 
 
రెండో కాన్పులో కూడా ఆడపిల్లలే పుట్టారని తండ్రి కేశ‌వులు ఆగ్రహంతో ఊగిపోయాడు. ముగ్గుర ఆడపిల్లల పోషణ తనవల్లకాదని వాపోయాడు. ఈ క్రమంలో ఎవరికీ తెలియకుండా క‌వ‌ల ఆడ శిశువుల‌తో పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ శిశువులు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లడాన్ని గమినించిన కుటుంబ సభ్యులు వారిని పిల్ల‌ల ఆసుపత్రిలో చేర్పించారు.
 
అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మెరుగైన వైద్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవల కేశ‌వులు ఓ దుకాణంలో పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments