Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి మోసం చేశాడనీ.. ప్రియుడిపై యాసిడ్‌తో దాడి...

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (12:51 IST)
ఇటీవలి కాలంలో ప్రేమించి మోసం చేసే ఘటనలు ఎక్కుగవా జరుగుతున్నాయి. దీంతో ప్రియురాళ్లు లేదా ప్రియులు ఆ మోసాన్ని జీర్ణించుకోలేక క్షణికావేశంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల మండలం, కొట్టాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొట్టాల గ్రామానికి చెందిన ఓ యువతీ యువకులు ప్రేమలోపడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, ఇంతలో ఏమైందో ఏమోగానీ.. ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. మోసం చేసిన నాగేంద్ర ముఖంపై యాసిడ్‌తో దాడి చేసింది. 
 
నాగేంద్రపై ఆ యువతి యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి. వారం రోజుల క్రితం కూడా యువకుడిపై ఆమె యాసిడ్ పోయగా, అతడి చేయి కాలింది. ఆ గాయానికి నాగేంద్ర చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన నుంచి తన మాజీ ప్రియుడు తేరుకోకముందే ఆమె మరోసారి యాసిడ్‌ దాడి చేసి కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments