Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:36 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ వ్యాప్తం పర్యటనలో భాగంగా, ఆయన హస్తిన పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పర్యటన మొత్తం ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఇందులోభాగంగా, ఆయన గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళతారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, ఆర్థిక వేత్తలతో సమావేశమవుతారు. దేశ ఆర్థిక  పరిస్థితులపై ఆయన చర్చిస్తారు. జాతీయ మీడియాతోనూ భేటీ అవుతారు. 
 
ఆ తర్వాత 22వ తేదీన చండీగఢ్ చేరుకుని కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతు కుటుంబాల వారిని ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి పరామర్శిస్తారు. ఆ తర్వాత ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. 
 
26న బెంగుళూరుకు చేరుకుని మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎ కుమార స్వామిలతోనూ, 27న మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధికి వెళ్లి అక్కడ అన్నా హజారేతో సమావేశమవుతారు. అక్కడ నుంచి షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శనం చేసుకుని, నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 29 లేదా 30వ తేదీల్లో వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు వెళతారు. ఈ సందర్భంగా ఇండో చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్‌ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల కుటుంబాలను పరామర్శిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments